Farah Khan: నా జీతం పెంచింది నాగార్జునే..!

Farah Khan: ఫ‌రా ఖాన్ అంటే తెలుగువారికి తెలీక‌పోవ‌చ్చు కానీ బాలీవుడ్‌లో ఆమె టాప్ కొరియోగ్రాఫర్, డైరెక్ట‌ర్. ఎన్నో స‌క్సెస్‌ఫుల్ సినిమాలు తీసారు. కొరియోగ్రాఫ‌ర్‌గా 1994 నుంచి 1995 మ‌ధ్య‌లో తెలుగులో ఎన్నో సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అక్కినేని నాగార్జున (akkineni nagarjuna)  సినిమాల‌కు కూడా ఫ‌రా ఖాన్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే అప్ప‌ట్లో ఒక పాట‌ను కొరియోగ్ర‌ఫీ చేయ‌డానికి ఫ‌రా ఖాన్ రూ.10 నుంచి రూ.15 వేలు తీసుకునేవార‌ని.. ఆ త‌ర్వాత త‌న రెమ్యున‌రేష‌న్ పెరిగేలా చేసింది నాగార్జునే అని అన్నారు. నాగార్జున సినిమాకు కొరియోగ్రాఫీ చేస్తుంటే ఆయ‌నే త‌న పారితోషికం పెంచిన‌ట్లు ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ద‌క్షిణాది న‌టీన‌టులు ఉద‌యాన్నే ఐదు గంట‌ల‌కు సెట్స్‌కి వ‌చ్చేస్తార‌ని క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ద‌క్షిణాది న‌టీన‌టుల నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో అలా కాద‌ని నిదానంగా షూటింగ్స్ చేస్తుంటార‌ని వెల్ల‌డించారు.