Deepfake: నేను గ‌ర్భా డ్యాన్స్ చేస్తున్న‌ట్లు వీడియో చేసారు..!

Deepfake: ఇటీవ‌ల న‌టి ర‌ష్మిక మంద‌న‌కు (rashmika mandanna) సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. ఢిల్లీ పోలీసులు ర‌ష్మిక డీప్ ఫేక్ వీడియో ఏ ఖాతా నుంచి వ‌చ్చిందో చెప్పాల‌ని మెటా సంస్థ‌కు లేఖ రాసి మ‌రీ అనుమానితుడిని బిహార్‌లో ప‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత క‌త్రినా కైఫ్, కాజోల్‌కి సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి.

ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) వీడియో వైర‌ల్ అవుతోంది. గ‌ర్భా పాట‌ను మోదీ పాడిన‌ట్లుగా డీప్ ఫేక్ వీడియో త‌యారుచేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. గుజ‌రాత్‌లో తాను దీపావ‌ళి స‌మ‌యంలో గ‌ర్భా డ్యాన్స్ చేస్తున్న డీప్ ఫేక్ వీడియో చూసాన‌ని ఏఐ సంస్థ‌లు ఇలాంటి వీడియోలు బ‌య‌టికి రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు.