Nikhil Siddharth: తండ్రి కాబోతున్న నిఖిల్
Nikhil Siddharth: నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య పల్లవి గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నిఖిల్ నిజమేనని అధికారికంగా వెల్లడించారు. కోవిడ్ సమయంలో నిఖిల్, పల్లవిల పెళ్లి జరిగింది. పల్లవి డాక్టర్. ఆమెను ఓ పార్టీలో చూసి నిఖిల్ ఇష్టపడ్డారు. పల్లవి కోసం ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంబు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.