Alia Bhatt: నన్ను స్టార్ కిడ్ అన్న వాళ్ల ముఖం పగలగొట్టాలనిపిస్తుంది
Alia Bhatt: తనను స్టార్ కిడ్ అన్న వాళ్ల దగ్గరికి వాళ్ల ముఖం పగలగొట్టాలన్నంత కోపం వస్తుందని అంటోంది ఆలియా భట్. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా తన తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తోనే తాన ట్యాలెంట్‌ను నిరూపించుకుంది. ఈరోజు తను ఒక జాతీయ అవార్డు గెలుచుకున్న నటి. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినంత మాత్రాన అన్ని సినిమాలు తనకే దక్కాలని లేదని.. మొదటి సినిమా తండ్రి ద్వారా తనకు లభిస్తే మిగతా సినిమాలన్నీ తన కష్టంతో సాధించుకున్నవే అని తెలిపారు.
ఈ విషయాలను ఆలియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆలియా వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఆలియా ఒక స్టార్ కిడ్డే అని.. ఆమెకు కష్టపడకుండా సినిమాలు దానితో పాటు డబ్బు వస్తుంటే ఇందులో తన కష్టం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చే వారికి అవకాశాలు ఇవ్వకుండా చాలా సినిమాలు ఆలియా భట్ వద్దకే వెళ్లాలని ఆరోపిస్తున్నారు. (alia bhatt)