Movie: 12 సినిమాలు చూస్తే 2 ల‌క్ష‌ల‌ రూపాయ‌లు మీవే..!

Movie: మీరు చ‌దివింది నిజ‌మే. మీరు 12 సినిమాలు చూడ‌గ‌లిగితే రూ.1,60,000 గెలుచుకోవ‌చ్చు. అదెలా అనుకుంటున్నారా? ఓ కంపెనీ ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. బ్లూమ్సీ బాక్స్ అనే అమెరిక‌న్ కంపెనీ సినిమా పిచ్చోళ్ల కోసం వెతుకుతోంది. కాక‌పోతే మీకు న‌చ్చిన సినిమా చూస్తానంటే కుద‌ర‌దు. మీరు క‌చ్చితంగా క్రిస్మ‌స్ పండుగ‌కు సంబంధించిన సినిమాలే చూడాలి. అది ఒక‌టి రెండు కాదు. ఏకంగా 12 క్రిస్మ‌స్ సినిమాలు. వారు ఇచ్చిన 12 సినిమాలు చూసి మీ విలువైన రివ్యూలు.. వారికి కావాల్సిన అంశాల‌ను ప‌రిశీలించి ఓ రిపోర్ట్ లాగా చేసిస్తే ఆ డ‌బ్బును మీకు ఇచ్చేస్తారు.

కంపెనీ చూడ‌మంటున్న సినిమాల లిస్ట్ ఇదే

1. The Most Wonderful Time of the Year (2008)
2. Crown for Christmas (2015)
3. The Nine Lives of Christmas (2014)
4. Christmas Getaway (2017)
5. Journey Back to Christmas (2016)
6. Ghosts of Christmas Always (2022)
7. Family for Christmas (2015)
8. Christmas Under Wraps (2014)
9. Three Wise Men and a Baby (2022)
10. A Royal Christmas (2014)
11. Northpole (2014)
12. The Christmas Train (2017)