Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో BRS డమ్మీ అభ్యర్థులు..!

Telangana Elections: BRS పార్టీకి చెందిన డ‌మ్మీ అభ్య‌ర్ధులు ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్‌లో (congress) చేరిన‌ట్లు తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 23 మంది తాము BRS పార్టీకి చెందిన‌వాళ్లం అని చెప్పుకుని కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో తాము BRS పార్టీకి చెందిన‌వాళ్లం అని చెప్పుకుంటున్న డ‌మ్మీ నేత‌లు ఉన్నారు.