వివాహేతర సంబంధాలను మళ్లీ చట్టవిరుద్ధం చేయాల్సిందే.. పార్లమెంట్లో కొత్త బిల్లు
Adultery: వివాహేతర సంబంధాలను మళ్లీ చట్ట విరుద్ధం చేయాలని భారత న్యాయ సన్హిత ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. 2018లో వివాహేతర సంబంధాలను సుప్రీంకోర్టు లీగల్ చేసింది. వివాహేతర సంబంధాలను నేరంగా భావించకూడదు అని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత న్యాయ సన్హిత ద్వారా కొత్త బిల్లును వేయించి దీనిని మళ్లీ చట్ట విరుద్ధం చేయాలని కోరుతున్నారు.
ఈ అంశంలో కొత్త లీగల్ కోడ్లను తీసుకురావాలని బిల్లులో కోరారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కొత్త చట్టం అమల్లోకి తెస్తారు. ఈ చట్టం అమల్లోకి వస్తే వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారిపై తీవ్ర చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం (chidambaram) స్పందిస్తూ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇద్దరు వ్యక్తుల వివాహేతర జీవితంలోకి పార్లమెంట్ ఎందుకు వేలు పెడుతోందని ప్రశ్నించారు.