Telangana Elections: ఎన్నిక‌ల బ‌రిలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఇత‌నే..!

Telangana Elections:  ఈసారి తెలంగాణ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. BRS కాంగ్రెస్ మ‌ధ్య పోటీ నువ్వా నేనా అన్న‌ట్లు సాగుతోంది. ఇక BJP జ‌న‌సేన (janasena) పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ వీరి నుంచి పెద్ద‌గా చ‌ప్పుడు లేదు. ఇక‌పోతే.. ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న అభ్య‌ర్ధుల్లో అత్యంత ధ‌న‌వంతుడైన అభ్య‌ర్ధి గురించి తెలుసుకుందాం. ఆయ‌న ఎవ‌రో కాదు. కాంగ్రెస్ (congress) త‌ర‌ఫు నుంచి చెన్నూరులో (chennur) పోటీ చేస్తున్న వివేకానంద‌ (vivekananda)

అఫిడ‌విట్‌లో ఇత‌నికి రూ.600 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. వివేకానంద‌కి అత్య‌ధిక ఆస్తులు విశాఖ ఇండ‌స్ట్రీస్‌లోనే ఉన్నాయి. ఈ ఇండ‌స్ట్రీస్‌ను వివేకా 1981లో స్థాపించారు. ఇక వివేకా, అత‌ని భార్య క‌లిపి తీసుకున్న లోన్ల విలువ రూ.41 కోట్లు.  వివేకానంద త‌ర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (srinivas reddy) ఉన్నారు. ఈయ‌న ఆస్తుల విలువ రూ.460 కోట్లు. అందుకే ఇటీవ‌ల ఈయ‌న నివాసంలో ఐటీ దాడులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.