Devara: సో బ్యూటిఫుల్.. సో ఎక్స్పెన్సివ్.. ఈ చీర ధరెంతో తెలుసా?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) కొరటాల శివ (koratala siva) కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ (janhvi kapoor) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వి తంగం (thangam) అనే పల్లెటూరి పిల్ల క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఇటీవల సినిమాలోని తన స్టిల్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. తంగం గెటప్‌లో జాన్వి అదిరిపోయారు.
అయితే ఈ ఫోటోలో జాన్వి కపూర్ వేసుకున్న చీరని గమనించారా. చూడటానికి ఏదో పాత దుస్తుల్లా అనిపిస్తున్నాయి కానీ దాని ధరెంతో తెలిస్తే షాకవుతారు. ఈ చీర ఖరీదు అక్షరాలా లక్ష తక్కువ రూ.95 వేలు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా ఈ చీరను స్పెషల్‌గా డిజైన్ చేసారు. త్వరలో సినిమా షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. సమ్మర్‌కు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.