Rashmika: సేమ్ ఇల్లు.. సేమ్ క్యాప్షన్..!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ (vijay devarakonda) రష్మిక మందన ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ కానీ రష్మిక కానీ స్పందించలేదు. ఇప్పటికే వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న టాక్ కూడా ఉంది. ఇందుకు కారణం విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్.. రష్మిక ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటం. అంతేకాదు.. వీరిద్దరూ ఫ్యాన్స్‌కి దీపావళి విషెస్ చెప్తూ ఒకటే క్యాప్షన్ వాడారు.
ఇప్పుడు దీపావళి వేడుకను కూడా ఇద్దరూ ఒకే ఇంట్లో చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రష్మిక పోస్ట్ చేసిన దీపావళి ఫోటోలు.. విజయ్ పెట్టిన దీపావళి ఫోటోలు ఒకే ఇంట్లోవి అని క్లియర్‌గా తెలిసిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న టైల్స్ ఒక్కటే. అంటే వీరిద్దరూ దీపావళి కూడా ఒకే దగ్గర చేసుకున్నట్లు మరోసారి క్లియర్ అయింది. ఇక ఆ శుభవార్తను అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.