Kumara Swamy: క‌ర్ణాట‌క‌లో గ‌తి లేదు తెలంగాణ‌లో హామీలా?

Kumara Swamy: కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి వెళ్లి 24 గంటల కరెంట్ ఇచ్చేస్తామంటున్నారు, ఇక్కడ కర్ణాటకలో 5 గంటల కరెంటుకే దిక్కులేదు అని పంచ్‌లు వేసారు క‌ర్ణాటక మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ఒక్కటి కూడా క‌ర్ణాట‌క‌లో ఈ రోజుకి అమలు చేయట్లేదని కానీ తెలంగాణకి వెళ్లి కరెంట్ ఇచ్చేస్తామని నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేసారు.