Palvayi Sravanthi: “కారెక్కిన” స్ర‌వంతి..!

Palvayi Sravanthi: మునుగోడు మాజీ కాంగ్రెస్ అభ్య‌ర్ధి పాల్వాయి స్ర‌వంతి ఈరోజు BRS పార్టీలో చేరారు. మంత్రి KTR స‌మ‌క్షంలో ఆమె BRS పార్టీ కండువాను క‌ప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి మునుగోడు టికెట ఆశించిన స్ర‌వంతికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆ పార్టీ మొండిచేయి చూపించింది. రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన 24 గంట‌ల్లో ఆయ‌న‌కు మునుగోడు టికెట్ ఇవ్వ‌డంతో స్ర‌వంతి కంట‌త‌డి పెట్టుకున్నారు. విలువ లేని చోట ఉండ‌లేను అని సోనియా గాంధీకి త‌న రాజీనామా లేఖ‌ను పంపారు.