Diwali: ఏ రాశివారు ఏ పనులు చేస్తే మంచిది?
Diwali: దీపావళి అనగానే ఎన్నో షాపింగ్ పనులు ఉంటాయి. కొత్త దుస్తులు, టపాసులు, స్వీట్స్, డెకరేషన్ వస్తువులు ఇలా చాలా కొనుగోలు చేస్తుంటారు. అయితే రాశులకు తగ్గట్టు వస్తువులను కొనుగోలు చేస్తే ఇంకా మంచిదని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పార్ధుమన్ సూరి.
మేషం
మేష రాశి వారు ఓ ఎర్రటి వస్త్రం కొనుగోలు చేస్తే మంచిది. ఈ వస్త్రాన్ని ఈ దీపావళి నుంచి 40 రోజుల పాటు దిండు పెట్టుకుని నిద్రపోతే అనుకున్న పనులు నెరవేరుతాయట.
వృషభం
శనివారం నాడు వృషభ రాశి వారు ఓ గిన్నె నిండా ఆవ నూనె తీసుకుని అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెతో శని దేవుడిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది.
మిధునం
ఈ దీపావళి రోజున మీరు గాజుకు సంబంధించిన ఎలాంటి కానుకలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వంటివి చేయకండి. ఒకవేళ అనుకోకుండా గాజు గిఫ్ట్‌లు మీ దగ్గరికి వస్తే వాటిని మీతో మాత్రం ఉంచుకోకపోవడం మంచిది. అంటే మీరు గాజుకు సంబంధించిన షాపింగ్ కూడా చేయకూడదు.
కర్కాటకం
కర్కాటక రాశి వారు స్నానం చేసే బకెట్లో కాసిన్ని గంగా జలాన్ని పోసుకుని స్నానం చేస్తే మంచిది. అయితే వట్టి పాదాలతో మాత్రం స్నానం చేయకూడదట.
సింహ
దీపావళి సమయంలో నల్ల నువ్వులు దానం చేస్తే ఎంతో మంచిది. అంతేకాదు ఈ రాశి వారు నోరుపారేసుకోకూడదు.
కన్య
కన్యా రాశి వారు ఎవరితోనూ గొడవలు వాదనలు పెట్టుకోకపోవడమే మంచిది. నదిలో కానీ ఎక్కడైనా జల ప్రదేశం ఉన్న చోట కానీ ఏడు కొబ్బరికాయలు వేస్తే మంచి జరుగుతుంది.
తుల
ఆవులకు బెల్లం తినిపిస్తే మంచిది.
వృశ్చికం
రోజ్‌వాటర్‌ను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే మంచిది.
ధనుస్సు
హనుమాన్ చాలీసా పఠిస్తే అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి.
మకరం
మద్యం, మాంసం వంటివాటికి దూరంగా ఉండాలి. ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన గొడుగులు ఉండకూడదు.
కుంభం
దీపావళి అంటే సుఖ సంతోషాలతో వెలుగుల మధ్య జరుపుకునే పండుగ. అందుకే కుంభ రాశి వారు ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. మీ భాగస్వామికి మంచి కానుక ఇస్తే మంచిది.
మీనం
ఇంట్లో విరిగిపోయిన సామాన్లు ఉంటే వెంటనే తీసేయడం మంచిది.