Israel Gaza War: కుటుంబంలోని 68 మంది మృతి
Israel Gaza War: ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధంలో ఒకే కుటుంబంలోని 68 మంది మృతిచెందారు. దాంతో ఆ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలు ఇక ఆపండయ్యా అంటూ అధికారులను వేడుకుంటోంది. పాలెస్తీనాకు చెందిన ఓ మహిళ అమెరికాలోని బోస్టన్‌లో శరణార్ధిగా నివసిస్తోంది. అయితే ఆమె కుటుంబం మొత్తం గాజాలోనే ఉంది.
ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడుల్లో తన కుటుంబంలోని 68 మంది మృత్యువాతపడ్డారట. అయితే బోస్టన్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఆ మహిళ అదే రెస్టారెంట్‌కు వచ్చిన యూఎస్ సెనేటర్ వారెన్ వద్దకు వెళ్లి దయచేసి త్వరగా ఈ దాడులను ఆపండి అంటూ ప్రాథేయపడింది. ఈ యుద్ధం ముగిసే లోపు ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలని ఆమె సెనేటర్‌ను ప్రశ్నించింది. దాంతో సెనేటర్ వారెన్‌కు ఏమని చెప్పాలో అర్థంకాక ఆ బాధితురాలి బాధను వింటూ ఉండిపోయింది.