Criminal Cases: అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంలు వీరే..!
Criminal Cases: దక్షిణాది రాష్ట్రాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులపై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ వెల్లడించింది. వీరిలో మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు KCR, జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) కూడా ఉన్నారు. ఇక మూడో సీఎం ఎవరో కాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin).
KCRపై మొత్తం 64 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 37 క్రిమినల్ కేసులు. ఆ తర్వాత స్థానంలో ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఈయనపై మొత్తం 47 కేసులు నమోదు కాగా.. వాటిలో 20 క్రిమినల్ కేసులు. ఇక జగన్ మోహన్ రెడ్డిపై మొత్తం 38 కేసులు నమోదు కాగా.. అందులో 35 కేసులు క్రిమినల్ కేసులుగా ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 43 శాతం మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. అంటే మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు బయటపెట్టారు. వీరిలో కొందరిపై దోపిడీ, హత్యలు, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. (criminal cases)