Telangana Elections: తెలంగాణలో జనసేనకు షాక్

Telangana Elections: తెలంగాణలో జనసేన పార్టీకి (janasena) ఎన్నికల సంఘం ఇంకా గుర్తును కేటాయించలేదు. ఈసీ రూల్స్ ప్రకారం రాష్ట్రంలో జనసేనకు ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేదు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కేటాయించిన గాజు గ్లాసు గుర్తుతో జ‌న‌సేన తెలంగాణ‌లో పోటీ చేయడానికి వీల్లేదు.