Patel Ramesh Reddy: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా

Patel Ramesh Reddy: త‌న‌కు టికెట్ ఇవ్వ‌నందుకు బోరున విల‌పించారు సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి. కాంగ్రెస్ రెబెల్ అభ్య‌ర్ధిగా ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని స‌వాల్ చేస్తారు. దామోదర్ రెడ్డి BRS పార్టీ కోవర్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడానికే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. సర్వేలు తాను గెలుస్తానని చెప్పినా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఆoతర్యమేంటని పార్టీని ప్ర‌శ్నించారు. పోయినసారి అధిష్టాన బుజ్జగింపులతో తలొగ్గాన‌ని ఈసారి తలొగ్గే ప్రసక్తే లేదని అన్నారు.