Telangana Elections: షర్మిళకు తెలీకుండా నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్ధి
Telangana Elections: ఎన్నికల్లో YSRTP ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలి మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని భావించి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిళ (ys sharmila). అయితే ఇదే పార్టీకి చెందిన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ షర్మిళకు తెలీకుండా రేవంత్‌పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడని కార్యకర్తల ద్వారా తెలుసుకున్న షర్మిళ వెంటనే అతన్ని ఆపారు. తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకుంటే భవిష్యత్తు మనదే అని హామీ ఇచ్చారు. షర్మిళ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని నీలం సుధాకర్ మాటిచ్చారు.