IT Raids: కాంగ్రెస్ సునామీలో కారు, కమలం గల్లంతే..!
IT Raids: తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని గ్రహించిన BRS, BJP పార్టీలు భయపడి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కాంగ్రెస్ సునామీలో కారు, కమలం గల్లంతవడం ఖాయమని అన్నారు. ఇప్పటివరకు ఎందుకని BRS, BJP పార్టీ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరగలేదని ప్రశ్నించారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు (thummala nageswara rao) ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. ఈరోజు ఆయన పాలేరులో నామినేషన్ వేయాల్సి ఉంది.