KCR: నేడే నామినేష‌న్…!

Telangana Elections: తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి KCR ఈరోజు నామినేష‌న్ వేయ‌నున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్‌తో (gajwel) పాటు కామారెడ్డిలో (kamareddy) కూడా ఈరోజే నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈరోజు ఏకాద‌శి ఉత్త‌ర న‌క్ష‌త్రం కావ‌డంతో మంచి రోజ‌ని జ్యోతిష్యులు చెప్ప‌డంతో KCR ఈరోజే రెండు చోట్ల నామినేషన్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అదీకాకుండా ఈరోజు తేదీ 9 కావ‌డం.. ఆయ‌న న‌క్ష‌త్రం ప్ర‌కారం 9 ల‌క్కీ నెంబ‌ర్ కావ‌డం విశేషం. గ‌జ్వేల్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు.. కామారెడ్డిలో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు నామినేషన్ వేస్తారు. అన్ని పార్టీల కీల‌క నేత‌లు కూడా ఈరోజే నామినేష‌న్ వేయ‌నున్నారు. ఇక KTR సిరిసిల్ల‌లో  (sircilla) నామినేష‌న్ వేయ‌డంతో పాటు తాను దత్త‌త తీసుకున్న కొడంగ‌ళ్‌లో పట్నం ప్ర‌భాక‌ర్ నామినేష‌న్‌కు KTR హాజ‌రుకానున్నారు. ఇక హ‌రీష్‌రావు కూడా ఈరోజే నామినేష‌న్ వేయ‌నున్నారు.