Sreeja: మనసు విరిగింది.. గాయపడింది.. శ్రీజ వైరల్ పోస్ట్
Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) చిన్న కూతురు శ్రీజ గురించి తెలీనివారు ఉండరు. కొన్నేళ్ల క్రితం భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో ఒప్పుకోలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతనితో ఒక బిడ్డని కన్నాక కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని పుట్టింటికి వెళ్లిపోయింది. కన్నబిడ్డ కాబట్టి కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు చిరు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ (kalyan dev) అనే మరో అబ్బాయితో ఘనంగా పెళ్లి చేసారు. శ్రీజ, కళ్యాణ్‌లకు నవిష్క జన్మించింది. వీరిద్దరి మధ్య కూడా పొరపొచ్చాలు రావడంతో విడిపోయారు. దాంతో తన ఇద్దరు పిల్లలతో శ్రీజ పుట్టింట్లోనే ఉంటోంది. (sreeja)
ఇక మళ్లీ పెళ్లి అనే ఆలోచన శ్రీజకు లేదనే తెలుస్తోంది. తన పిల్లలే లోకంగా జీవిస్తోంది. అయితే ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల (varun tej lavanya tripathi marriage) వివాహానికి ఇటలీ వెళ్లి వచ్చిన శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. “” జీవితంలో కొన్ని విషయాలు నా కంట్రోల్లో లేనప్పుడు, పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, మనసు విరిగి గాయపడినప్పుడు, శరీరం అలసిపోయినప్పుడు.. కాస్త అలా కళ్లు మూసుకుని మనలోని ప్రపంచంతో రీకనెక్ట్ అవ్వాలి. అదొక్కటే మార్గం “” అని పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌కి కామెంట్స్ వెల్లువ ఉంటుందని ముందే గమనించిన శ్రీజ కామెంట్ సెక్షన్‌ని ఆఫ్ చేసారు. (sreeja)