Jagan: ఇలాగైతే 2024లో గెల‌వ‌డం క‌ష్టం.. నేత‌ల‌పై సీఎం ఫైర్

Jagan: ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్ట‌ప‌ర్తి జిల్లాకు (puttaparthi) చెందిన నేత‌ల‌పై మండిప‌డ్డారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో అంత‌ర్గ‌త కొట్లాట‌ల వ‌ల్ల త‌న‌కు ప్ర‌మాదం అని.. ఇలాగైతే 2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని మంద‌లించారు. పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గ YSRCP నేత‌లు సోమ‌శేఖర్, ఇంద్ర‌జిత్ రెడ్డిలు శ్రీధ‌ర్ గురించి జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డితో జ‌గ‌న్ మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డి త‌న బాధ‌ను జ‌గ‌న్‌కు చెప్పుకున్నారు. తాను వంద‌ల కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ సోమ‌శేఖ‌ర్ రెడ్డి, ఇంద్ర‌జిత్ రెడ్డిలు సోష‌ల్ మీడియాలో త‌న గురించి త‌ప్పుడు పోస్ట్‌లు పెట్టిస్తున్నార‌ని శ్రీధ‌ర్ రెడ్డి వాపోయారు. సోమ‌శేఖ‌ర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నార‌ని శ్రీధ‌ర్ రెడ్డి జ‌గ‌న్‌కు చెప్ప‌గా.. ఈ వ‌య‌సులో టికెట్ ఎందుక‌ని జ‌గ‌న్ సోమ‌శేఖ‌ర్ రెడ్డిని ప్ర‌శ్నించారు. అయితే టికెట్ త‌న కోసం కాద‌ని త‌న కుమారుడి కోసం అడుగుతున్న‌ట్లు తెలిపారు. కొడుకు ఇంకా చిన్న‌వాడు అయిన‌ప్పుడు వ్యాపారాలు చేసుకోక అప్పుడే రాజ‌కీయాలు టికెట్లు ఎందుకని జ‌గ‌న్ అడిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. (jagan)

ఇలా పుట్ట‌పర్తిలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ మంత్రి పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డిని పిలిపించి మాట్లాడార‌ట‌. కొద్దిరోజుల్లో ఈ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు తొల‌గిపోయి నేత‌లు ఐక‌మత్యంగా ఉండేలా చూడాల‌ని జ‌గ‌న్ పెద్ద‌రెడ్డికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది.