Varun Lavanya Wedding: OTT ప్లాట్‌ఫాంకి ఎన్ని కోట్ల‌కు అమ్మారో తెలుసా?

Varun Tej Lavanya Tripathi Wedding: వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి అట్ట‌హాసంగా ఇట‌లీ వేదిక‌గా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక నిన్న రిసెప్ష‌న్ కూడా చాలా గ్రాండ్‌గా చేసారు. అయితే పెళ్లికి సంబంధించిన వీడియోని ప్ర‌ముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కి (netflix) అమ్మార‌ట‌. అది కూడా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు రూ.8 కోట్ల‌కు అమ్మిన‌ట్లు తెలుస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్‌ల (nayanthara vignesh shivan wedding) వివాహ వీడియోను కూడా నెట్‌ఫ్లిక్సే కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్ట్ ఉల్లంఘ‌న నేప‌థ్యంలో ఆ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మ‌లేదని టాక్. ఇక హ‌న్సిక వివాహ (hansika wedding) వీడియో రైట్స్ డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది.