KCR: తప్పిన పెను ప్రమాదం

Telangana Elections: సీఎం KCRకు తప్పిన పెను ప్రమాదం త‌ప్పింది. ఈరోజు నియోజక వర్గాల పర్యటనలో భాగంగా దేవకద్రకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరగా హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్‌ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్‌ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటుచేసారు. కాసేప‌టికే KCR సుర‌క్షితంగా దేవ‌ర‌క‌ద్ర చేరుకున్నారు.