రిజర్వేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టి.. సీట్లు మాత్రం ఇవ్వ‌ని BJP

Telangana Elections: పార్ల‌మెంట్‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును (women reservation bill) ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త మాదే అని గొంతు చించుకుని మ‌రీ అరిచిన BJP.. తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హిళా అభ్య‌ర్ధుల‌కు మాత్రం మొండిచేయి చూపించింది. గ్రామీణ ప్రాంతాల‌తో పోలిస్తే GHMCలో BJPకి బ‌లం బాగానే ఉంది. కానీ GHMC నుంచి ఒక్క మ‌హిళా అభ్య‌ర్ధికి కూడా సీటు కేటాయించ‌లేదు. అటు బండారు విజ‌య‌ల‌క్ష్మికి కానీ ఇటు బండ కార్తీకా రెడ్డికి కానీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య‌ల‌క్ష్మికి ముషీరాబాద్ టికెట్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆమెకు నిరాశే మిగిలింది.

GHMC తొలి మ‌హిళా మేయ‌ర్ కార్తీకా రెడ్డి. కిష‌న్ రెడ్డి (kishan reddy) ఆశీస్సుల‌తో ఆమెకు సికింద్రాబాద్ టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు. 2019లో కాంగ్రెస్ నుంచి BJPలోకి వెళ్లిన కార్తీకా రెడ్డి.. BJP నుంచి తెలంగాణ‌లో స్టార్ మ‌హిళా క్యాంపెయిన‌ర్‌గా ఉన్నారు. సిరిసిల్ల‌లో KTRపై పోటీకి రాణి రుద్ర‌మ‌ను బ‌రిలోకి దింపింది BJP. కానీ ఈటెల రాజేంద‌ర్‌తో (etela rajender) పాటు BJPలో చేరిన తుల ఉమ‌కు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి టికెట్ ఇవ్వ‌లేదు. చాలా మంది మ‌హిళా అభ్య‌ర్ధులు ఉన్న‌ప్ప‌టికీ ఈసారి BJP వారికి టికెట్లు కేటాయించ‌లేదు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వ‌ర‌కు మాత్రమే మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఉంది కానీ నిజ జీవితంలో మాత్రం వారికి ఎలాంటి అవ‌కాశాలు లేవ‌ని ప‌లువురి అభిప్రాయం.