T Rajaiah: వాహ్ అన్నా.. వాహ్..!

Telangana Elections:  స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టికెట్ కోసం క‌డియం శ్రీహ‌రి (kadiyam srihari), తాటికొండ రాజ‌య్య (t rajaiah) మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉండేది వీరి వైరం. కానీ మంత్రి KTR వీరితో మాట్లాడి క‌లిపారు. KTR రాజ‌య్య‌కు ఏం చెప్పారో ఏం ప‌ద‌వి ఇస్తాన‌న్నారో తెలీదు కానీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో క‌డియం శ్రీహ‌రి గెల‌వాల‌ని రాజ‌య్య డ‌ప్పులు కొడుతూ డ్యాన్స్‌లు వేస్తూ మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.