Mrunal Thakur: అల్లు అరవింద్ పెళ్లి కామెంట్.. వరుడ్ని వెతికిపెట్టమన్న నటి
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (allu arvind) ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో నటి మృణాల్ ఠాకూర్‌కు (mrunal thakur) అవార్డ్ ఇస్తూ నువ్వు కూడా తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని సరదాగా అన్నారు. దాంతో మృణాల్ వద్ద పనిచేసేవారు కుటుంబ సభ్యులు పెళ్లి గురించి తెగ ఆరా తీస్తున్నారట. ఎవరా అబ్బాయి అంటూ ఒకటే మెసేజ్‌లు కాల్స్ చేస్తున్నారట. దాంతో మృణాల్ అల్లు అరవింద్ కామెంట్‌పై స్పందించారు. ఆయన తనను సరదాగా ఆశీర్వదిస్తే అంతా నిజం అనుకున్నారని ఒక మంచి అబ్బాయిని చూసి వేదికను ఫిక్స్ చేస్తే అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు.