ఆపరా బాబూ.. లాయర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వింత రిక్వెస్ట్
సుప్రీంకోర్టులో (supreme court) లాయర్ల వాదనలు వింటున్న న్యాయమూర్తికి ఒకానొక సమయంలో చిరాకేసింది. కాసేపటి తర్వాత ఆయన మీద ఆయనకే అసహ్యమేసింది. దాంతో ఆయన న్యాయవాదులకు ఓ వింత రిక్వెస్ట్ చేసారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బుధవారం ఓ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు బొప్పన్న, నరసింహలు కోర్టుకు హాజరయ్యారు. కేసు వాదిస్తున్న సమయంలో ఓ సీనియర్ లాయర్ మాటి మాటి మై లార్డ్.. మై లార్డ్ అంటూనే ఉన్నారు. ఆయన కేసు గురించి వాదించినదానికంటే మై లార్డ్ అనడమే ఎక్కవైపోయింది. దాంతో న్యాయమూర్తి నరసింహకు ఒళ్లు మండింది. లాయర్ గారూ.. మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్ అనడం ఆపండి బాబు. మీరు ఆ మాట అనకుండా వాదిస్తే నా సగం జీతం మీకు ఇస్తాను అనేసారు. దాంతో అక్కడున్నవారు కాసేపు షాకై ఆ తర్వాత అంతా నవ్వుకున్నారు.
మై లార్డ్ అనడం లాయర్లకు వాదిస్తున్నప్పుడు అనడం అలవాటు. కానీ ఈ మాట పాతకాలం లాంటిది. ఇప్పుడు ఎవ్వరూ కూడా వాదించే సమయంలో మై లార్డ్ అనడంలేదు. కావాలంటే మై లార్డ్కి బదులు సర్ అనాలని.. లేదంటే ఎన్ని సార్లు వాదించే సమయంలో మై లార్డ్ అంటున్నావో లెక్కించి ఫిర్యాదుగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయమూర్తి నరసింహ వార్నింగ్ ఇచ్చారు.
2006లో బార్ కౌన్సిల్ మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ అని సంబోధించడం మానేయాలని తీర్మానించింది. కానీ ఇంకా ఈ పదాలను పలువురు లాయర్లు వాడుతూనే ఉన్నారు.