Pushpa 2 గ్లింప్స్​ డేట్ ఫిక్స్!

మెగాస్టార్​ చిరంజీవి అల్లుడు, నిర్మాత అల్లు అరవింద్​ కొడుకు, ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు.. అనే ట్యాగ్​లతో ఇండస్ట్రీకి పరిచయమై తక్కువ సమయంలోనే వాటిని వదిలించుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ క్రియేట్​ చేసుకున్నారు స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. సరికొత్త స్టైల్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను అందుకుని స్టార్​ హీరోగా ఎదిగారు. ఇక సుకుమార్​ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్​గా దేశవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నారు. బన్నీకి కేరళలో ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ లీకైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ మూవీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. మొత్తంగా పుష్ప మేనియాతో ఇండియానే కాదు.. ప్రపంచమే ఊగిపోయిందని చెప్పొచ్చు.

ఇక ‘పుష్ప’ మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో.. రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనిక ‘పుష్ప.. ద రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు ఇప్పటికే రివీల్​ చేసింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ చాలా భాగం పూర్తయింది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్​ వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌ రోల్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనసూయతో ఐటెం సాంగ్ కూడా ఉంటుందని టాక్.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రాబోతున్న ‘పుష్ప ది రూల్’ గ్లింప్స్ వీడియోకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అండ్ కట్ ఇప్పటికే కంప్లీట్ అయిందని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వీడియో ఏకంగా 3 నిమిషాల పాటు సాగుతుందట. ఇక, దీనికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పుష్ప ది రూల్’ మూవీ నుంచి విడుదల కాబోతున్న గ్లింప్స్ గురించి తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు లీకయ్యాయి. మూడు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలనే చూపించబోతున్నారట. అంతేకాదు, ఇందులో బన్నీ నోటి నుంచి వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్ కాబోతుందని సమాచారం. మొదటి భాగంలో వచ్చిన ‘తగ్గేదేలే’ అనే డైలాగ్​ ఎంత పాపులర్​ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న డైలాగ్​ ఏ రేంజ్​లో ఉండబోతుందో తెలియాలంటే ఏప్రిల్​ 8 వరకు ఆగాల్సిందే!