USA: మా బిడ్డను క్షేమంగా తీసుకురండి నాయనా
Telugu Student in USA: అమెరికాలో (usa) వరుణ్ అనే ఖమ్మం విద్యార్థిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఇండియానాలోని వాల్పరైసో నగరంలోని ఓ జిమ్‌లో జోర్డాన్ ఆడ్రాడ్ అనే 24 ఏళ్ల వ్యక్తి అదే జిమ్‌లో వరుణ్ (varun) అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసాడు. వరుణ్ తల భాగంలో కత్తి గాట్లు పడటంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వరుణ్ బతికే ఛాన్స్ జీరో నుంచి 5% వరకు మాత్రమే ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వరుణ్ తల్లిదండ్రులు ఎన్నారై సంఘాన్ని ఆశ్రయించారు. వారు ఎప్పటికప్పుడు వరుణ్ పరిస్థితిని తెలుసుకుంటూ సమాచారం అందిస్తున్నారు. “” నా బిడ్డ ఏ తప్పూ చేయలేదు. వాడిని ఎందుకు ఇలా చేసారో తెలీడంలేదు. మంచి వైద్యం అందించి మా దగ్గరకు క్షేమంగా తీసుకువచ్చేలా చూడండి నాయనా. మా అబ్బాయి అనే కాదు.. అక్కడ చదువు కోసం అని వెళ్తున్న ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు కూడా మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదు “” అని కన్నీరుమున్నీరవుతున్నారు.
వరుణ్‌పై దాడి చేసిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. జిమ్‌కి వెళ్లి మసాజ్ కావాలని ఓ వ్యక్తిని అడిగానని.. అతను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్లమని చెప్పాడని.. ఆ వరుణ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను కాస్త విచిత్రంగా ప్రవర్తించాడని తెలిపాడు. ఎందుకైనా మంచిదని తన దగ్గరున్న కత్తితో పొడిచేసానని అన్నాడు.