స్టైలిష్ లుక్‌లో స్టైలిష్ స్టార్ వైఫ్.. హీరోయిన్గా ట్రై చేయండి అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ హీరోలకే కాదు వాళ్ల భార్యలకీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆ జాబితాలో ముందుండే పేరు అల్లు స్నేహారెడ్డి. అల్లు అర్జున్ భార్యగా పరిచయమైనా స్నేహాకి ఉన్న ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక స్నేహా ఎక్కడ కనిపించినా ఓ సెన్సేషనే. ఎందుకంటే ట్రెండ్‌ని మించిన దుస్తుల్లో కనిపించి అభిమానులను అలరిస్తుంటుంది ఈ ఫ్యాషన్ ఐకాన్. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహాని ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎనిమిది మిలియన్లకు పైమాటే. స్నేహ ఏ ఫొటో షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా స్నేహ షేర్ చేసిన ఓ ఫొటో చూసి ఆడవాళ్లు కూడా కుళ్లుకుంటున్నారు. అదిరిపోయే చీరకట్టులో అంత అందంగా ఉంది మరి!
ఇక స్నేహ తన ఫ్యామిలీ ఫొటోలే కాకుండా అప్పుడప్పుడు తన ఫ్యాషన్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అందరిని మెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన బ్యాక్ లెస్ జాకెట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కానప్పటికీ, అల్లు స్నేహా రెడ్డి మోడ్రన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తన ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేసేస్తుంది. హీరోయిన్లను తలదన్నేలా ఫోటో షూట్స్‌లో పాల్గొంటూ ఆయా ఫోటోలను తరచుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పెడుతుంది స్నేహ. ఇక ఈసారి మోడ్రన్ డ్రెస్సులతో కాకుండా చీరలోనే మోడ్రన్ కనిపించి అందరినీ మెప్పించింది. కళ్లు చెదిరే డిజైనర్ చీరతో పురివిప్పిన నెమలిలా నిల్చున్న స్నేహా రెడ్డి అందం కూడా అభిమానులను కట్టిపడేస్తోంది.