Telangana Elections: డామినేషన్ ఈ రెండు పార్టీలదే..!
Telangana Elections: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికార BRS పార్టీకి ఎప్పుడూ బైపోలార్ (రెండు కోణాలు) పోటీ ఉంటోంది. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా BRSకి కాంగ్రెస్, BJP వ్యతిరేకంగా ఉన్నాయి. BJP తెలంగాణలో పోటీ చేస్తోందన్న మాటే కానీ ప్రజల ఫోకస్ మొత్తం BRS, కాంగ్రెస్ పార్టీలపైనే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో అధికార BRS పార్టీని డామినేట్ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే.
కాంగ్రెస్ తర్వాత AIMIM పార్టీ ఉంది. కానీ AIMIM BRS పార్టీ వైపే ఉంది. అందుకే అసదుద్దిన్ ఒవైసీ ఎప్పుడూ కూడా AIMIM పోటీ చేసే దగ్గర తమకు ఓట్లు వేయాలని.. BRS పోటీ చేయని దగ్గర పార్టీకి ఓటు వేయాలని అంటుంటారు. మూడోసారి కూడా KCR సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. KCRకి దాదాపు అన్ని కుల వర్గాల నుంచి సపోర్ట్ ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో కులాల వారీగా ఓటింగ్ జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రకులాలకు చెందిన 47% మంది BRS పార్టీకి సపోర్ట్‌గా నిలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ శాతం కాస్తా 14కి పడిపోయింది. మిగతా 32 శాతం కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసింది. (telangana elections)
తెలంగాణలో అత్యధిక జనాభా బీసీలే ఉన్నాయి. వారి సపోర్ట్ భారత రాష్ట్ర సమితి పార్టీకే ఉంది. కానీ 2018లో భారత రాష్ట్ర సమితికి 50% బీసీలు మద్దతుగా నిలిస్తే 2019లో అదే బీసీలు 41% మంది సపోర్ట్ చేసారు. కాంగ్రెస్‌కు బీసీల నుంచి ఎప్పుడూ కూడా 30% సపోర్ట్ లభిస్తోంది. ఇక ఎస్సీల విషయానికొస్తే 2018లో ఈ వర్గానికి చెందినవారు 53% మంది భారత రాష్ట్ర సమితికి ఓటు వేసారు. ఆ తర్వాత ఆ సపోర్ట్ 2019 లోక్ సభ ఎన్నికలకు లేకుండా పోయింది. ఓట్ల శాతం 51%కి చేరింది.
ఇక ముస్లిం ఓట్ల విషయానికొస్తే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌కు సమానంగా వారి ఓట్లు పడుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో 43 శాతం మంది ముస్లింలు భారత రాష్ట్ర సమితికి సపోర్ట్ చేయగా.. 42 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. భారత రాష్ట్ర సమితికి రెడ్ల ఓట్లలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్ల నుంచి భారత రాష్ట్ర సమితికి 42% ఓట్లు రాగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం వారి సపోర్ట్ పడిపోయింది. 2018లో కాంగ్రెస్‌కు రెడ్ల సపోర్ట్ బాగా పెరిగింది. ఇక ఆదాయాలను బట్టి కూడా ఓట్లలో మార్పులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల సపోర్ట్ భారత రాష్ట్ర సమితికి ఉంది. ఇక ఈసారి ఈ కులాల వారీగా ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయో చూడాలి. (telangana elections)