పదవ సినిమా మొదలెట్టేసిన మాస్ కా దాస్!
హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సినిమాలు రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ సినిమా విడుదలవుతోంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై అభిమానులను పలకరించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కి ముందే మరో సినిమాని ప్రారంభించేశారు విశ్వక్. VS10గా రూపొందుతున్న ఈ సినిమా విశ్వక్ కెరీర్‌కి చాలా ప్రత్యేకం కాబోతోంది.
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తన 10వ సినిమాను చేస్తోన్న విశ్వక్.. ఈ చిత్రం ద్వారా దర్శకుడు రవితేజ ముళ్లపూడిని పరిచయం చేస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ప్రస్తుతానికి vs10గా పిలుస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి భార్య రజనీ క్లాప్ ఇవ్వగా.. రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు దర్శకుడికి నిర్మాత రామ్ తాళ్లూరి స్క్రిప్ట్‌ను అందజేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్’ అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. విశ్వక్ సేన్‌తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ సినిమాతో అది కుదిరింది. చాలా మంచి స్క్రిప్ట్. చాలా మంచి పాత్ర. ఇంత మంచి టీంతో కలసి పని చేయబోతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’ అని అన్నారు.
ఇక, ఈ సినిమాకు నిర్మాతగా రామ్ తాళ్లూరి వ్యవహరిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ కటసాని కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్. క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.