Ukraine లో ఘోరం.. కుటుంబంలోని 9 మంది హ‌త్య‌

Russia Ukraine war: ర‌ష్యా చేస్తున్న యుద్ధం కార‌ణంగా అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లోని ర‌ష్యా ఆక్ర‌మించుకున్న వోల్నోవ‌కా అనే ప్రాంతంలో 9 మంది దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో హ‌త్య ఎవ‌రు చేసి ఉంటారు అనేదానిపై అటు ర‌ష్యా ఇటు ఉక్రెయిన్ పోలీసులు ఎవ‌రికి వారు విచార‌ణ‌లు చేప‌డుతున్నారు.

మ‌రోప‌క్క ఉక్రెయిన్ అధికారులు ర‌ష్యా సైనికులే ఈ దారుణానికి ఒడిగ‌ట్టి ఉంటార‌ని నింద‌లు వేస్తున్నారు. అక్టోబ‌ర్ 27న ర‌ష్యా సైనికులు త‌ల‌దాచుకోవ‌డానికి సాయం అడిగార‌ని.. ఇందుకు ఆ కుటుంబం ఒప్పుకోనందుకే వారిని దారుణంగా చంపేసార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు ర‌ష్యా విచార‌ణాధికారులు ఇద్ద‌రు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారు ర‌ష్య‌న్ సైనికులే అని అంటున్నారు.