‘నాటు నాటు’ క్రేజ్.. ప్రపంచ కుబేరుడు ఫిదా!

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా విడుదలై.. అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఆస్కార్​ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని నాటు పాట సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ ప్రేక్షకులను మెప్పించి ఆస్కార్​ కైవసం చేసుకుని భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. మిలియన్ల వ్యూస్​తో యూట్యూబ్​లో రికార్డులు సృష్టించిన ఈ పాట మరోసారి  ట్రెండింగ్​లో నిలుస్తోంది. తాజాగా ఈ పాటకి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా కంపెనీ తమ కార్లతో మ్యూజిక్ కి సింక్ అయ్యేలా లైట్స్ ట్రీట్ తో అదిరిపోయే వీడియో చేసింది. దీంతోపాటు ఈ వీడియోకి రెండు లవ్ ఎమోజీలతో చిత్ర యూనిట్ కి సోషల్ మీడియాలో టెస్లా కంపెనీ రిప్లై ఇచ్చింది.

తన బిజినెస్, డాజి, టెస్లా కొన్ని మీమ్స్ తో సోషల్ మీడియాలో గడిపే ఎలాన్ మస్క్ సినిమాలకు సంబంధించి ఎప్పుడూ పోస్ట్ చేయరు అంతేకాదు కనీసం స్పందించరు కూడా. అటువంటిది ఇప్పుడు RRRకి రిప్లై ఇవ్వడం క్రేజీ అంశమైంది. మేము మా లవ్ ని పే చేస్తున్నాము అంటూ చిత్ర యూనిట్ రిప్లై ఇచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ ను ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఈ పాట‌ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా అమెరికాలోని టెస్లా కార్ ఓన‌ర్స్ డిఫ‌రెంట్‌గా సెల‌బ్రేట్ చేయాలని అనుకున్నారు. ఆస్కార్ వేడుకలో సింగ‌ర్స్ కాల‌భైర‌వ‌, రాహుల్ సింప్లిగంజ్ ఈ పాట‌ను లైవ్‌లో పాడారు. ఫారిన్ డాన్స‌ర్లు  స్టెప్పులేసి ఆద‌ర‌గొట్టారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవ‌డం ప‌ట్ల వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఒక్కొక్కొరు ఒక్కోలా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అమెరికాలోని టెస్లా కార్ ఓన‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

నాటు నాటు పాట మ్యూజిక్ బీట్స్‌ కు పార్కింగ్ ఏరియాలో ఉన్న వంద‌లాది టెస్లా కార్ హెడ్ లైట్స్‌, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నట్టు ఈ వీడియోలో క‌నిపిస్తోంది. టెస్లా కార్ల‌లో ఉండే లైట్‌షో అనే ఫీచ‌ర్‌ను ఉప‌యోగించి చేసిన ఈ వీడియో ఆర్ఆర్ఆర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు మిలియ‌న్ల‌లో వ్యూస్ వస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా గ‌త ఏడాది మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఇండియాలోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.