Vizag: గంజాయి పండించడానికి అనుమతి కావాలట
గంజాయి పండించడానికి రైతులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ రైతు వెరైటీ డిమాండ్ చేస్తున్నాడు. వైజాగ్‌కి (vizag) చెందిన జనజాగరణ సమితి గంజాయి సాగుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు ఏడాదికి రూ.4 లక్షల పెట్టుబడి పెడితే రూ.40 లక్షల ఆదాయం వస్తుంది. ప్రపంచంలోనే రైతులకు అత్యధిక ఆదాయం ఇచ్చే పంట గంజాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి, రైతులను అప్పుల నుంచి బయటపడేయాలి అని ఆ సమితి కోరింది.