KCR: గ‌న్‌మెన్‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రించిన‌ సీఎం

Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్ర‌చారంలో ఉండ‌గా సిద్ధిపేట‌లో ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆయ‌న గ‌న్‌మెన్ ప్రభాక‌ర్ రెడ్డిని కాపాడాడు. లేదంటే మ‌రిన్ని కత్తి గాట్లు ప‌డేవే. ఈ విష‌యం తెలుసుకున్న సీఎం KCR.. గ‌న్‌మెన్‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రించారు. కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై జ‌రిగిన దాడి త‌న‌కు జ‌రిగిన‌ట్లుగానే భ‌విస్తాన‌ని కేసీఆర్ అన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచార‌ణ చేప‌ట్టి నిందితుల‌కు శిక్ష ప‌డేలా చేస్తాన‌ని అన్నారు.