దీపిక‌ను ఎందుకు అస‌హ్యించుకుంటున్నారు.. ఏం జ‌రిగింది?

Deepika Padukone: ఇప్పుడు సోష‌ల్ మీడియా మొత్తం న‌టి దీపిక ప‌దుకొణెపై విష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో నిండిపోయింది. ఒక‌ప్పుడు ఆమెను రోల్ మోడ‌ల్‌గా చూసిన‌వారంతా ఇప్పుడు అస‌హ్యించుకుంటున్నారు. ఇందుకు కార‌ణం బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహారే (karan johar).

అస‌లు ఏం జ‌రిగింది?

క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేసే ప్ర‌ముఖ టీవీ షో కాఫీ విత్ క‌ర‌ణ్ (koffee with karan) కొత్త సీజ‌న్ మొద‌లైంది. తొలి గెస్ట్‌లుగా దీపిక ప‌దుకొణె త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్‌తో (ranveer singh) క‌లిసి వ‌చ్చారు. ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. ఆ ఎపిసోడ్ చూసిన‌వారంతా దీపికను రాయ‌లేని ప‌దాల‌తో దూషిస్తున్నారు. (deepika padukone)

సాధార‌ణంగా ఈ కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌ర‌ణ్ జోహార్ రిలేష‌న్‌షిప్స్, పాత ఎఫైర్స్, గ‌తంలో జ‌రిగిన గొడ‌వ‌లు.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఒక సెల‌బ్రిటీని ఏ విష‌యాలు అడిగితే అడ్డంగా దొరికిపోతారో ఆ విష‌యాల‌నే అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అఫ్‌కోర్స్.. వారు మాత్రం అడ‌గ్గానే చెప్పేయ‌రు క‌దా..! అడిగినంత డ‌బ్బు కూడా ఇస్తారు.

ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్‌.. దీపిక‌ను ఒక ప్ర‌శ్న అడిగారు. ర‌ణ్‌వీరే మీకు క‌రెక్ట్ అని ఎందుకు అనిపించింది అని. ఇందుకు దీపిక స‌మాధానం చెప్తూ.. ర‌ణ్‌వీర్‌తో ప్రేమ‌లో ఉన్నప్పుడు త‌న మైండ్‌లో మాత్ర‌మే రిలేష‌న్‌షిప్‌ని ఫిక్స్ అయ్యాన‌ని.. కానీ బ‌య‌టికి మాత్రం ఇత‌రుల‌ను కూడా ట్రై చేస్తుండేదానిని అని చెప్పారు. ఈ ఒక్క మాట ర‌ణ్‌వీర్ విని షాక‌య్యాడు. ఆల్మోస్ట్ అత‌ని క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. ర‌ణ్‌వీర్ మాత్రం దీపిక త‌న‌కు దేవ‌త లాంటిద‌ని.. త‌న ఇంటి మ‌హాల‌క్ష్మి అని చాలా గొప్ప‌గా చెప్పాడు. కానీ దీపిక మాత్రం ర‌ణ్‌వీర్‌ని ఒక ఆప్షన్‌లా మాత్ర‌మే చూసిన‌ట్లు ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. (deepika padukone)

మొత్తం ఎపిసోడ్‌లో చాలా అంశాలు ఉంటే.. కేవ‌లం ఈ పాయింట్‌కి సంబంధించిన వీడియోని మాత్ర‌మే పోస్ట్ చేస్తూ దీపిక‌పై విషం జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నా ఫ‌ర్వాలేదు కానీ దీపిక లాంటి భార్య మాత్రం ఎవ్వ‌రికీ దొర‌క‌కూడ‌దు అని డైరెక్ట్‌గా అనేసాడు. త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్ గురించి దీపిక ఇంకా స్పందించలేదు. ఇన్నాళ్లూ దీపిక ర‌ణ్‌వీర్ మేడ్ ఫ‌ర్ ఈచ్ ఆద‌ర్ అనుకున్నామ‌ని.. కానీ దీపిక ఇలాంటి బ‌జారుది అనుకోలేదంటూ చాలా అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతున్నారు. వీటికి దీపిక స్పందిస్తే కానీ ఇలా మాట్లాడేవారికి బుద్ధిరాద‌ని మ‌రికొంద‌రు ఫ్యాన్స్ అంటున్నారు.

క‌ల్కి సినిమాపై ప్ర‌భావం

ఇక ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న క‌ల్కి (kalki) సినిమాలో దీపిక ప‌దుకొణె కీల‌క రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్పుడు దీపిక‌పై వ‌స్తున్న నెగిటివికీ ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో ఆ సినిమాపై ఏమ‌న్నా ప్ర‌భావం చూపుతుందేమోన‌న్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో న‌టీన‌టులు వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టే వారి సినిమాల స‌క్సెస్ ఆధార‌ప‌డి ఉంటోంది. వారి ప్ర‌వ‌ర్త‌న బాలేదు అంటే వారి సినిమాల‌ను కూడా జ‌నాలు చూడ‌టానికి ఇష్టప‌డటంలేదు. (deepika padukone)