Telangana Elections: గెలుపు త‌లుపులు తెరుచుకుంటాయా?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్‌లో BRS, BJP పార్టీల మ‌ధ్య ట‌ఫ్ కాంపిటీష‌న్ నెల‌కొన‌నుంది. BRS నుంచి గంగుల క‌మ‌లాక‌ర్.. (gangula kamalakar) BJP నుంచి  బండి సంజ‌య్ కుమార్ (bandi sanjay kumar) పోటీ చేయ‌నున్నారు. 2019లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) పాపులారిటీతో క‌రీంన‌గ‌ర్‌లో ఎంపీ సీటు ద‌క్కించుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సీటో కోసం గంగుల క‌మ‌లాక‌ర్‌పై పోటీకి దిగ‌నున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గంగుల క‌మ‌లాక‌ర్‌పై సంజ‌య్ గెల‌వ‌లేక‌పోయారు. కానీ ఈసారి ఇరు పార్టీల మ‌ధ్య క‌ఠిన పోటీ ఉండ‌బోతోంది. ఎందుకంటే ఈసారి కరీంన‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి పొన్నం ప్ర‌భాక‌ర్ వేరే సీటు నుంచి పోటీ చేయ‌నున్నారు. అదీకాకుండా 2018తో పోలిస్తే బండి సంజయ్‌కు క‌రీంన‌గ‌ర్‌లో బాగానే పాపులారిటీ పెరిగింది. మ‌రోప‌క్క గంగుల క‌మ‌లాక‌ర్ మూడు సార్లు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. బీసీల కోసం ఎన్నో మంచి ప‌నులు చేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఎక్కువ‌గా బీసీ యువ‌త నుంచి గంగుల క‌మ‌లాక‌ర్‌కు భారీ స‌పోర్ట్ ఉంది. (telangana elections)

2018 నుంచి చూసుకుంటే ఈ ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌కు ఓట్ల శాతం భారీగానే పెరిగింద‌ని తెలుస్తోంది. క‌మ‌లాక‌ర్‌కు క‌రీంన‌గర్ రూర‌ల్ ప్రాంతాల్లో పాపులారిటీ బాగా పెర‌గ్గా.. బండి సంజ‌య్‌కు క‌రీంన‌గర్ అర్బ‌న్‌లో పాపులారిటీ పెరిగింది. క‌రీంన‌గ‌ర్‌లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉండ‌గా అందులో ఒక్క సీటు మాత్ర‌మే BJPకి ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కు రెండుసార్లు కరీంన‌గ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన బండి సంజ‌య్.. ఇప్పుడు మూడోసారి ఓడిపోయి హ్యాట్రిక్ కొడ‌తారా? లేక అప‌జ‌యాల ప‌ర్వాన్ని దాటుకుని గెలుస్తారా అనేది వేచి చూడాలి.