Tulasi: ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉండాలి?
తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. తులసి (tulasi) మొక్క లేని తెలుగు వాకిలి ఉండదు. అయితే కొందరు చాలా తులసి మొక్కలను పెంచుతూ ఉంటారు. అసలు ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉంటే మంచిదో తెలుసుకుందాం.
*వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కలు ఎప్పుడైనా బేసి సంఖ్యలో ఉండాలి. అంటే 1, 3, 5.. ఇలా ఉండాలి.
*ఉత్తరం, ఈశాన్య మూలల్లో తులసి మొక్క ఉంటే ఎంతో మంచిది.
*ఎందుకంటే ఈ ఉత్తర, ఈశాన్య దిక్కులనేవి నీరు ప్రవహించే దిశలట. ఇక ఆగ్నేయ దిక్కు అగ్నికి వర్తిస్తుంది. అందుకే ఆ దిక్కున తులసి మొక్కను ఉంచకూడదు. (tulasi)
*తులసి మొక్క ఉండే స్థలం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. తులసి ఉన్న ప్రదేశంలో చీపుర్లు, చెత్త డబ్బాలు వంటివి ఉంచకూడదు.
*తులసి మొక్క దానంతట అదే నేలలో నుంచి వస్తే ఫర్వాలేదు కానీ మనం నాటాలనుకుంటే మాత్రం కుండీలోనే నాటాలి.
*ఇక ఎలాంటి ముళ్ల మొక్కల పక్కన తులసిని ఉంచకూడదు. (tulasi)
*తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండిపోయేలా చచ్చిపోయేలా అలా వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ నీళ్లు పోస్తూ ఉండాలి. మొక్క పచ్చగా ఉంటే ఆ ఇల్లు కూడా సంతోషంగా పచ్చగా ఉంటుందని నమ్ముతారు.