Yerra sekhar: BRSలో చేరిన కాంగ్రెస్ నేత‌

Telangana Elections: ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (yerra sekhar) BRS పార్టీలో చేరారు. కాంగ్రెస్ (congress) రెండో అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేయ‌డంతో పార్టీలో అసంతృప్తుల లొల్లి మొద‌లైపోయింది. జడ్చర్ల, నారాయణపేట టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్‌కు (yerra sekhar) పార్టీ మొండి చెయ్యి చూపడంతో ఆయ‌న‌ ఆగ్రహం వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.