Vishwak Sen: బ్యాక్‌గ్రౌండ్ లేద‌ని త‌గ్గేకొద్ది మింగుతున్నారు.. విశ్వ‌క్ ఆగ్ర‌హం

Gangs of Godavari: విశ్వ‌క్ సేన్ (vishwak sen) హీరోగా న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమా రిలీజ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబ‌ర్ 8న రిలీజ్ చేయాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయిపోయారు. బ్యాక్‌గ్రౌండ్ లేద‌ని త‌గ్గేకొద్ది మింగుతున్నార‌ని.. ఇక ఏం జ‌రిగినా సినిమాను డిసెంబ‌ర్ 8న రిలీజ్ అవ్వ‌డం ప‌క్కా అని విశ్వ‌క్ కొంద‌రికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

“” బ్యాక్ గ్రౌండ్ లేక‌పోతే ప్ర‌తీ నా కొడుకు మ‌న గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడ‌కుండా ప్ర‌తి ఫేం ప్రాణం పెట్టి ప‌ని చేసి చెప్తున్నా. డిసెంబ‌ర్ 8న వ‌స్తున్నాం.. హిట్, ఫ్లాప్, సూప‌ర్ హిట్, అట్ట‌ర్ ఫ్లాప్, డిజాస్ట‌ర్ అనేది ఆడియ‌న్స్ చెప్తారు. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణ‌యం క‌దా.. త‌గ్గేకొద్దీ మింగుతారు అని అర్థమైంది. డిసెంబ‌ర్ 8న శివాలెత్తిపోద్ది. గంగ‌మ్మ త‌ల్లికి నా ఒట్టు. మ‌హాకాళి నాతో ఉంది. ఇక సినిమా డిసెంబ‌ర్‌లో రిలీజ్ అవ్వ‌క‌పోతే ఏ ప్ర‌మోష‌న్స్‌లో మీరు న‌న్ను చూడ‌రు “” అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు విశ్వ‌క్. (vishwak sen)