Varun Lavanya Marriage: భార్యతో కలిసి ఇటలీ బయలుదేరిన పవన్
Varun Tej Lavanya Tripathi Wedding: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) తన సతీమణి ఆన్నా లెనోవాతో (anna lezhnova) ఇటలీ బయలుదేరారు. తన అన్న కొడుకు వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం (varun lavanya marriage) నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరగనుంది. ఆల్రెడీ వరుణ్, లావణ్య, వైష్ణవ్ తేజ్, నిహారిక నిన్న ఉదయమే ఇటలీ వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ తన సతీమణితో కలిసి వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మిగతా కుటుంబ సభ్యులు ఈరోజు రాత్రికి ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు హీరో నితిన్ తన భార్య షాలినితో కలిసి ఇటలీ బయలుదేరారు. వీరికి కూడా వరుణ్, లావణ్యల వివాహానికి ఇన్విటేషన్ అందింది. వివాహం తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నారు.