Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ ఏడాదిలో వచ్చే రెండో చంద్ర గ్రహణాన్ని (lunar eclipse) రేపే చూడబోతున్నాం. రేపు, ఎల్లుండి వరకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. చంద్ర గ్రహణం నాడు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
*చంద్ర గ్రహణం ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు దేవుడి మంత్రాలను జపించడం ఉత్తమం.
*గ్రహణం పట్టడానికి ముందు స్నానం చేయడంతో పాటు గ్రహణ విడుపు స్నానం కూడా తప్పనిసరిగా చేయాలి. (lunar eclipse)
*గర్భిణిలు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
*చంద్ర గ్రహణం నాలుగు గంటల పాటు ఉండనుంది. ఈ సమయంలో ఏమీ తినకూడదు తాగకూడదు అని పెద్దలు అంటుంటారు. అందుకే ఏం తిన్నాలన్నా తాగలన్నా గ్రహణానికి ముందే కానిచ్చేయాలి. గ్రహణ సమయంలో తినడం వంటివి చేస్తే కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. (lunar eclipse)
*అవసరంలో ఉన్నవారికి మీకు తోచినంత సాయం చేయండి. ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టినా పుణ్యమే.
*వండిన వంటకాలపై తులసి దళాలు వేసి ఉంచడం ఉత్తమం.
*గ్రహణ సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. హానికరమైన కిరణాలు శరీరానికి తాకుతాయి.
*గ్రహణ సమయంలో పూజలు నిర్వహించకూడదు. అందుకే గ్రహణం నాడు ఆలయాలను మూసివేస్తుంటారు.
*నేరుగా గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది కాదట.
*గ్రహణం పట్టడానికి ముందే అన్నీ వండేసుకోవాలి. గ్రహణ సమయంలో వండటం అశుభం. కావాలంటే గ్రహణం వీడాక వండుకోవచ్చు.