భార‌త అధికారుల‌కు మ‌ర‌ణ శిక్ష‌.. ఎందుకు ఖ‌తార్ శిక్ష‌లు అంత క‌ఠినం?

Qatar: భార‌త్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారుల‌కు ఖ‌తార్ ప్రభుత్వం మ‌ర‌ణశిక్ష విధించింది. దీనిపై భార‌త ప్ర‌భుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ఖ‌తార్‌లో గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అక్కడి ప్ర‌భుత్వం వారిని 2022లో అదుపులోకి తీసుకుంది. వీరంతా అప్ప‌ట్లో అల్ ద‌హ్రా అనే కంపెనీలో ప‌నిచేస్తుండేవారు. వీరు జ‌లాంత‌ర్గామికి సంబంధించిన అంశంలో గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ వారిని అదుపులోకి తీసుకుంది. వీరంతా భార‌త్‌కు చెందిన‌వారు కావ‌డంతో ఇక్క‌డి ప్ర‌భుత్వంలో మాట్లాడించే ప్ర‌య‌త్నం కూడా చేసింది. భార‌త ప్ర‌భుత్వం వారిని విడిపించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది కానీ అవేవీ ఫ‌లించ‌లేదు. ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ కేసు విష‌యంలో ఖ‌తార్ న్యాయ‌స్థానం ఈరోజు తీర్పు వెల్ల‌డిస్తూ వారికి మ‌ర‌ణ శిక్ష‌ను విధించింది. (qatar)

ఖ‌తార్‌లో విదేశీయులు పాటించాల్సిన రూల్స్

అక్క‌డ పెళ్లికాకుండా శృంగారంలో పాల్గొంటే నేరం

బ‌య‌టికి వెళ్లేట‌ప్పుడు స‌రైన డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌కూడదు

పోలీస్ అధికారుల‌కు కానీ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కానీ మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తే నేరం

అక్క‌డి సంసృతి, సంప్ర‌దాయంపై పొర‌పాటుగా తెలీక కామెంట్ చేసినా ఒప్పుకోరు

ప‌బ్లిక్‌గా డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటివి నిషేధం

ఖతార్ వాసుల నుంచి ఏదైనా ఆహ్వానం అందితే త‌ప్ప‌కుండా వెళ్లాల్సిందే

ఖ‌తార్‌ది షారియా చ‌ట్టం. వారు ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తారు. అలాంటిది ఇత‌ర దేశాల‌కు చెందిన అధికారులు త‌మ దేశంలో ప‌నికి వచ్చి గూఢ‌చ‌ర్యం చేస్తుంటే ఊరుకుంటారా? అస‌లు భార‌తీయులే కాదు ఇత‌ర దేశాలకు చెందిన‌వారు కూడా ఖ‌తార్ వెళ్లి ప‌నిచేయాలంటే భ‌య‌ప‌డ‌తారు. కానీ మ‌న వాళ్లు మ‌న దేశం కోసం రిస్క్ చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు. (qatar)

ఖతార్‌లో ముస్లింలు ఎక్కువ‌గా ఉంటారు. దాదాపు 80% మంది అక్క‌డ ఉండేది ముస్లింలే. వారు ఫాలో అయ్యేది ఇస్లాం చ‌ట్టం, రూల్స్. ఈ రూల్స్‌ని ఎవ‌రు అతిక్ర‌మించినా వారు ఏ దేశానికి చెందిన‌వారు అని చూడ‌రు. ఎవ్వ‌రు చెప్పినా విన‌రు. ఇప్పుడు మ‌న భార‌త ప్ర‌భుత్వం వారికి క‌నీసం మ‌ర‌ణ శిక్ష ప‌డ‌కుండా ఉండేందుకు అన్ని ర‌కాల ఆప్ష‌న్స్ వెతుకుతోంది.