Hanuman: ఆర్థిక నష్టాలు తొలగించే ఆంజనేయ మంత్రాలు
ధైర్యం, శక్తి, జ్ఞానానికి ప్రతీక ఆంజనేయ స్వామి (hanuman). ఆర్థిక నష్టాలు తొలగిపోవాలంటే ఆంజనేయస్వామికి సంబంధించిన మూడే మూడు మంత్రాలు భక్తితో జపిస్తే వెంటనే నష్టాల నుంచి గట్టెక్కిస్తారట. ఆ మంత్రాలేంటో తెలుసుకుందాం.
ఓం హనుమతే నమః
ఈ మంత్రం రోజూ జపించడం ద్వారా మీలో కాన్ఫిడెన్స్ స్థాయులు పెరుగుతాయి. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎదిరించే ధైర్యం వస్తుంది. ఈ ఆంజనేయ మూల మంత్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని కార్య సిద్ధి మంత్రం అని కూడా అంటారు. మీరు ఏదన్నా ముఖ్య కార్యాన్ని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని పలుమార్లు జపించండి.
ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్త్యా వాయుపుత్రాయ నమోస్తుతే!
మంచి కెరీర్లో స్థిరపడేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఉద్యోగం లేనివారికి ఉన్న ఉద్యోగంలో సంతోషం లేక వేరే ఉద్యోగం కోసం వెతుకుతున్నవారికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. గురువారం ఉదయాన్నే 11 సార్లు ఈ మంత్రాలు జపిస్తే మంచిది. (hanuman)
హః హనుమతే రుద్రాత్మకాయ్ హః ఫట!
ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఆంజనేయ రుద్రమంత్రం అంటారు. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. కోరిన కోర్కెలను వెంటనే తీర్చే మంత్రంగా చెప్తుంటారు. అన్ని ఆటంకాలను తొలగించి మనిషిని దృఢంగా మార్చే మంత్రం ఇది.