Eknath Shinde: వదిలేస్తే వారు హమాస్‌తో కూడా పొత్తు పెట్టుకుంటారు
శివసేన (shivsena) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై (uddhav thackaray) అనుచిత వ్యాఖ్యలు చేసారు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ శిందే (eknath shinde). వదిలేస్తే వారు పాలెస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌తో (hamas) కూడా పొత్తు పెట్టుకుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఆజాద్ మైదాన్‌లో దసరా సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఏకనాథ్ పాల్గొన్నారు.
స్వలాభం కోసం ఉద్ధవ్ హమాస్, లష్కరే తైబాతో కూడా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (lok sabha elections) నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన ఉద్ధవ్ బాల్సాబ్ ఠాక్రే వర్గం (UBT) ఇండియా (india bloc) కూటమితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. 2004లో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ దిష్టిబొమ్మను శివసేన అధినేత బాల్సాబ్ ఠాక్రే చెప్పుతో కొట్టారు. ఇప్పుడు ఆయన కొడుకు ఉద్ధవ్ అదే కాంగ్రెస్ పార్టీ చెప్పులు మోసేందుకు సిద్ధం అయ్యారని ఎగతాళి చేసారు.