ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి
Spiritual: ఇంట్లో మనం తెలిసో తెలీకో పెట్టుకునే వస్తువులు వాస్తు (vastu) ప్రకారం అస్సలు మంచివి కావు అని అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ ఐదు రకాల వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లైతే అవి నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయట. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..
ముళ్లున్న మొక్కలు
*మొక్కలను పెంచుకోవడం శుభ సూచకమే కానీ ముళ్లున్న మొక్కలను మాత్రం అస్సలు ఇంట్లో పెట్టుకోకండి. మొక్కలకు ఉన్న ముళ్లు విషపూరిత బాణాలతో సమానం. అయితే రోజా మొక్కలకు మాత్రం ఇది వర్తించదు. రోజా పూల మొక్కలు ఇంట్లో ఉంటే మంచిదే.
*ఇంట్లో పెయింటింగ్స్ ఉంటే మంచిదే కానీ ఆ పెయింటింగ్స్ కోపంగా, బాధగా, భయంకరంగా మాత్రం ఉండకూడదు. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా ఉన్న పెయింటింగ్స్, మునిగిపోతున్నట్లుగా ఉన్న పడవ, నగ్నంగా ఉన్న ఫోటోలు, కత్తులతో ఫైట్ చేస్తున్నట్లుగా ఉన్న బొమ్మలు, ఎండిపోయిన చెట్ల పెయింటింగ్స్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
*ఆగిపోయిన, పగిలిపోయిన గడియారాలు ఉంటే వెంటనే తీసేయండి. ఆగిపోయిన గడియారాలకు కొత్త బ్యాటరీలు వేసి వాడుకుంటే ఫర్వాలేదు. (spiritual)
*ఇంట్లో చచ్చిపోయిన మొక్కలు కానీ ఎండిపోయిన మొక్కలు కానీ ఉంటే వెంటనే తీసేయండి. మొక్కలు అంటే ప్రకృతి. అవి ఎండిపోయిన చనిపోయినా మంచిది కాదు. వెంటనే వేరే మొక్కను పెడితే మంచిది.
*వాటర్ ఫౌంటెయిన్లు పెట్టుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ అలాంటివి పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాటర్ ఫౌంటెయిన్ ఉంటే నీళ్లు పోతుంటాయి. ఏ ఇంట్లో అయితే ఎక్కువ నీరు వృథా అవుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అంటారు.