Harish Shankar: టైటిల్ మ‌ర్చిపోయిన ప‌వ‌న్.. అవ‌మానం కాదా?

Ustaad Bhagat Singh: హ‌రీష్ శంక‌ర్ (harish shankar) డైరెక్ష‌న్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan)  ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ ఉస్తాద్‌తో పాటు ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. మ‌రోప‌క్క అటు రాజ‌కీయప‌రంగానూ బిజీ అయిపోయారు.

అయితే ఈరోజు ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నిర్మాత గురించి మాట్లాడాల‌నుకున్నారు. అయితే ఆయ‌న‌కు సినిమా పేరు గుర్తుకు రాలేదు. అదేదో భ‌గత్ సింగ్ సినిమా అంటూ త‌డ‌బ‌డ్డారు. దాంతో ఈవెంట్‌కి వ‌చ్చిన ఫ్యాన్స్ అది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా అని టైటిల్‌ని గుర్తుచేసారు. అప్పుడు ప‌వ‌న్ టైటిల్‌ని గుర్తుచేసుకున్నారు.

ఈ వీడియోని ప‌వ‌న్ ఫ్యాన్స్ హ‌రీష్ శంక‌ర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసారు. ఇది సినిమా టీంకి అవ‌మాన‌క‌ర‌మే కదా. ప‌వ‌న్ అన్నకు కూడా ఓజీ టీం అంటేనే ఇష్టం అని రెచ్చ‌గొట్టేలా కామెంట్ చేసారు. దీనిపై హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ.. “” అవ‌మాన‌మా? ఇందులో అవ‌మానం ఏముంది? పర్లేదు గుర్తు చేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి, మేమంతా కష్టపడుతున్నాం “” అని రిప్లై ఇచ్చారు. (harish shankar)