Barack Obama: గాజాపై చేస్తున్న దాడులు బ్యాక్‌ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది

Israel Gaza War: ఇజ్రాయెల్ గాజాపై దాడులు మ‌రింత ఉధృతం చేసింది. ఈ నేప‌థ్యంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా (barack obama) స్పందించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది కానీ దాని వ‌ల్ల ఇజ్రాయెల్‌కే బ్యాక్‌ఫైర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయ‌ని అర్థంచేసుకోలేక‌పోతోంద‌ని అన్నారు. ప్ర‌స్తుతానికి ఇజ్రాయెల్ గాజాలోని ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఆహారం, నీరు, విద్యుత్ అందించ‌డం లేదు.

ఇప్పుడు ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు (benjamin netanyahu) ఏదో కోపంలో ఈ నిర్ణ‌యం తీసుకుని ఉండొచ్చు కానీ మున్ముందు తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌ని హెచ్చ‌రించారు. పాలెస్తీనా వాసుల్లో భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఇజ్రాయెల్ త‌ప్పుడు అభిప్రాయం క‌లిగిస్తుంద‌ని అంత‌ర్జాతీయ స‌పోర్ట్ కూడా ఇజ్రాయెల్‌కు ల‌భించే అవ‌కాశం ఉండ‌ద‌ని దాని వ‌ల్ల ఇజ్రాయెల్ శ‌త్రువులకు లాభం చేకూరుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఒబామా అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు ఇరాన్ విష‌యంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు మ‌ధ్య సత్సంబంధాలు అంత‌గా బాలేవు.  (israel gaza war)